
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు.
బావిలో దూకి ఒకరు..
లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని యువకుడు..
ఆదిలాబాద్‌టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంపై విరక్తితో వ్యక్తి..
నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య