
క్రీడలతో ఒత్తిడి దూరం
నిర్మల్‌టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్‌ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.