
జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్ర
కై లాస్‌నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్‌పూర్‌కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్‌లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్‌తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్‌ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు.
పోకిరీలకు కౌన్సెలింగ్
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్‌కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.