
‘స్వర్ణ’లో ఇసుక తోడేళ్లు
నిర్మల్ రూరల్ మండలంలోని తంశ, చిట్యాల గ్రామాల్లో స్వర్ణ నదిలో ఇసుకను కొందరు అక్రమంగా ప్రమాదకరంగా తోడేస్తున్నారు. వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ ఇసుకాసురులు కూలీలతో నీటిలో పది అడుగుల లోతు నుంచి ఎలాంటి భయం లేకుండా ఇసుకను వెలికి తీయిస్తున్నారు. ఇలా తీసిన ఇసుకను ట్రాక్టర్లలో నింపి మంజులాపూర్ నుంచి ఈద్గాం చౌరస్తా వరకు రోడ్డు పక్కన అన్‌లోడ్ చేసి విక్రయిస్తున్నారు. పట్టపగలే ఇసుకను ప్రమాదకరంగా వెలికి తీస్తూ.. అక్రమంగా తరలిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్

‘స్వర్ణ’లో ఇసుక తోడేళ్లు

‘స్వర్ణ’లో ఇసుక తోడేళ్లు

‘స్వర్ణ’లో ఇసుక తోడేళ్లు