
మానసిక ఒత్తిడితో అనారోగ్య సమస్యలు
నిర్మల్‌చైన్‌గేట్: మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని జిల్లా జనరల్ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ ఎండీ డాక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయాలని సూచించారు. మానవతా, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం అనే థీమ్‌తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత సెల్‌ఫోన్‌తో సమయాన్ని వృథా చేస్తుందని, అలా కాకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి.శకుంతల, టీచింగ్ స్టాఫ్ నాగజ్యోతి, సువర్ణ, మంజుల, సంధ్య, నవోదయ, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.