
ప్రతినెలా వేతనాలు చెల్లించాలి
భైంసాటౌన్/నర్సాపూర్(జి)/ఖానాపూర్: తమకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని భైంసా ఏరియా ఆస్పత్రి నర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. వేతనాలు సకాలంలో జమ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ద్వారా ఒకటో తేదీన వేతనాలు జమ చేయాలని కోరారు. నర్సాపూర్(జి) సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు. ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ సీహెచ్‌సీ ఎదుట కూడా ఉద్యగులు, సిబ్బంది నిరసన తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సూపరిండెంట్ వంశీ మాదవ్, ఉద్యోగులు, నాయకులు శ్రీనివాసచారి, సాయికృష్ణ, సుధీర్, శైలజ, మమత పాల్గొన్నారు.