
స్వదేశానికి రప్పించరూ..
8లోu
న్యూస్‌రీల్
జోర్డాన్‌లో జిల్లావాసుల కష్టాలు అక్కడఉండలేక... ఇక్కడికి రాలేక... సోషల్ మీడియాలో వీడియో విడుదల బాధిత కుటుంబీకుల వేడుకోలు
నిర్మల్
రాష్ట్రస్థాయి బాక్సింగ్
పోటీలకు జిల్లా క్రీడాకారులు
నిర్మల్‌టౌన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 12 వరకు వరంగల్‌లో నిర్వహించే అండర్–17 బాల, బాలికల రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి నిఖిత(భైంసా), కీర్తన(నిర్మల్), అభినయ(నర్సాపూర్(జి)), శ్రావణి(ఖానాపూ ర్), పల్లవి(బాసర), కవిత (జామ్ ), సంజన(నిర్మల్) రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, సెక్రెటరీ చందులస్వామి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్ వీడ్కోలు పలికి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిలో సరైన ఉపాధి లేక బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన జిల్లావాసులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రం నుంచి జోర్డాన్ దేశానికి గతేడాది వెళ్లిన 12 మంది అక్కడ కనీస అవసరాలు కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తమను స్వగ్రామాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. ఈమేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ 12 మందిలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన మెట్టు ముత్యం, కుంటాల మండల కేంద్రానికి చెందిన ముఖీం గతేడాది సెప్టెంబర్‌లో ఉపాధి నిమిత్తం ఓ ఏజెంటు ద్వారా కంపెనీ వీసాపై జోర్డాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జనావాస ప్రాంతాలకు దూరంగా ఉండటమే కాకుండా, కనీస ఆహారం, నిద్ర కూడా కరువై నరకం అనుభవిస్తున్నామని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. దీంతో బాధిత కుటుంబీకులు తమ వారిని ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని వేడుకుంటున్నారు.
నకిలీ ఏజెంట్ల నిర్వాకం..
విదేశాలకు వెళ్లేందుకు ఉచిత వీసాలను సైతం వేల రూపాయల నగదుకు అమాయకులకు అమ్మి నకిలీ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే కుంటాల మండలం అందకూరు గ్రామానికి చెందిన ఓ ఏజెంట్ జిల్లాకు చెందిన మెట్టు ముత్యం, ముఖీం వద్ద వేల రూపాయలు తీసుకుని నైపుణ్యరహితమైన ఉపాధి పనులపై జోర్డాన్ దేశానికి పంపించారు. అక్కడ జనావాసాలకు దూరంగా వ్యవసాయక్షేత్రాల్లో పనుల్లో చేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి ఇండియాకు రావాలన్నా భారీ మొత్తంలో జరిమానా చెల్లించి వెళ్లాలని అక్కడి యజమాని షరతును విధిస్తున్నట్లు బాధితులు విడుదల చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు.. మహారాణులు!
మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.
ఎన్‌ఆర్‌ఐ కమిటీ భరోసా..
జోర్డాన్‌లో చిక్కిన వారి గురించి రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ అడ్వైజర్ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్లను సంప్రదించగా, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎకమిటీ ద్వారా కలెక్టరేట్‌లోని గల్ఫ్ హెల్ప్ లైన్, హైదరాబాదులోని ప్రవాసి ప్రజావాణిలో వివరాలను అందజేస్తామని తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం శాఖ అధికారులతో మాట్లాడి పూర్తి నివేదిక అందజేయనున్నట్లు వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ల మాయాజాలంలో చిక్కుకొని గల్ఫ్ దేశాల్లో నైపుణ్యరహిత పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. విదేశాలకు వెళ్లేవారు ప్రభుత్వ ఆమోదిత ఏజెంట్లను ఆశ్రయించాలని, సరైన కంపెనీ వీసాల మీదనే విదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

స్వదేశానికి రప్పించరూ..