
‘ట్రాన్స్‌మిషన్ అసెస్మెంట్ సర్వేపై శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో లింఫోటిక్ ఫైలేరి యా నియంత్రణకు ట్రాన్స్‌మిషన్ అసెస్మెంట్ సర్వేపై జిల్లాలోని వైద్యాధికారులకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఆరోగ్య పర్యవేక్షకులకు మహిళా ఆరోగ్య సహాయకులకు, ఆశ వర్కర్లకు జిల్లా సమీకృత కార్యాలయంలో గురువారం శిక్షణ ఇచ్చారు. సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో లింఫోటిక్ ఫైలేరియా వ్యాప్తి తెలుసుకునేందుకు ట్రాన్స్‌మిషన్ అసెస్మెంట్ సర్వేపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎంపిక చేయబడిన గ్రామాల్లో 20 ఏళ్లు పైపడిన వారికి ఫైలేరియా పరీక్ష స్టిరప్స్ ద్వారా రక్తాన్ని పరీక్షించడం జరుగుతుందన్నారు. సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష, జాతీయ కీటక జనిత వ్యాధుల రాష్ట్ర కన్సల్టెంట్ తిరుపతి, ఫైలేరియా కన్సల్టెంట్ ఎం.లక్ష్మణ్ కార్యక్రమా నిర్వాహణాధికారి డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ఆశిష్‌రెడ్డి, డాక్టర్ రాజారమేశ్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.