
కంటి పరీక్షలు చేయించుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి క్రమంత ప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. వరల్డ్ ఐ సైట్ డే పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విటమిన్ ఏ కంటికి మేలు చేస్తుందన్నారు. ఏటా అక్టోబర్ 9న వరల్డ్ ఐ సైట్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కంటి ఆరోగ్యం, జాగ్రత్తలను తెలియజేయడానికి, అంధత్వ నివారణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లను వాడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేష్, కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ ఆశీష్‌రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.