
ప్రహ్లాద్ చరిత్రలో నిలిచిపోతారు
నిర్మల్ టౌన్: మున్సిపల్ ఉద్యమ చరిత్రలో ప్రహ్లాద్ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రహ్లాద్ చిత్రపటానికి గురువారం పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపల్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రహ్లాద్ జీవితాంతం శ్రమించి, మున్సిపల్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునకు దారిచూపిన మహోన్నత నాయకుడు అని కొనియాడారు. ట్రెజరీ ద్వారా జీతాల సాధనలో ఆయన చూపిన నిబద్ధత , పోరాటస్ఫూర్తి, సహ ఉద్యోగులపై చూపిన అనురాగం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీరాజ్, మేనేజర్ అనూప్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు దేవీదాస్, ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు.