
రూ.50 వేలు దాటితే సీజ్
నిర్మల్‌టౌన్: జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నిక ల కోడ్ అమలులో ఉన్నందున ఎస్పీ జానకీ షర్మిల జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారం లేకుండా రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, సమస్యలు సృష్టించే ట్రబుల్ మంగర్స్‌ను, రౌడీలను, కేడీలను, సస్పెక్ట్‌ల ను ముందస్తుగా బైండోవర్ చేస్తామని వెల్లడించా రు. నవంబర్ 11 వరకు కోడ్ అమలులో ఉండడంతో ఎస్పీ రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు, జిల్లా ప్రజలకు ఎన్నికల నియమావళిని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసి,అనుభవజ్ఞు లైన అధికారులను, సిబ్బందిని నియమించామన్నా రు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచారు. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అ భ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఉపయోగించాలి. లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి తీసుకోవాన్నారు. ప్రజలు ఎలాంటి అనుమాదాస్పద కార్యకలాపాలు గమనించినా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659555 నంబర్‌కు, వాట్సాప్ నంబర్ 8712659599 కు సమాచారం అందించాలని తెలిపారు.