
మొదలై.. ఆగింది
సారంగపూర్/కడెం/ఖానాపూర్/లక్ష్మణచాంద/దస్తురాబాద్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 9 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు కలెక్టర్ అభిలాష అభినవ్ నోటిఫికేషన్ గురువారం జారీ చేశారు. ఈమేరకు తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ప్రారంభించారు. కలెక్టర్ సారంగాపూర్, కడెం మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. హెల్ప్‌డెస్క్, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, పరిశీలించిన అనంతరం రిజిష్టర్లు పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై గురించి ఆరా తీశారు. ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సందర్శించారు. అయితే సాయంత్రం జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈసీ ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ చేపడతామని తెలిపారు. లక్ష్మణచాంద, సారంగాపూర్, ఖనాపూర్, కడెంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జెడ్పీ సీఈవో గోవింద్ , సీఐ అజయ్ పరిశీలించారు. వారివెంట ఎంపీడీవో సూజాత, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీవో రమేశ్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.