
బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం
భైంసాటౌన్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేష న్ సాధించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రావు పటేల్ నివాసంలో గురువారం మాట్లాడారు. ఎన్నిక ల నోటిఫికేషన్, జీవో 9పై హైకోర్టు స్టే విధించడం బీసీ ఆశావహులను నిరాశపర్చిందన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతుతో బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా, వారు ఆమోదించలేదన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు సాగిందన్నారు. ఈ క్రమంలో జీవో 9పై హైకోర్టు స్టే విధించడం కలవరపరిచిందని తెలిపా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రా వు పటేల్, ముధోల్ ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి ఉన్నారు.
పలువురికి పరామర్శ..
భైంసా ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తల్లి ఇటీవల మృతి చెందగా కాశీనాథ్‌ను, బీజేపీ నాయకుడు గోపాల్ సర్డా, కుమార్ యాదవ్ కుటుంబాలను వేణుగోపాలచారి పరామర్శించారు.