
జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్‌రూరల్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్)ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం అండర్–17 బాలబాలికల జోనల్ స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను డీఈవో భోజన్న ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, కోచ్‌లు శేఖర్, రా జేశ్, స్వామి, క్రీడల కన్వీనర్ సత్తయ్య, పీడీలు భూమన్న, కిశోర్, తదితరులు పాల్గొన్నారు.