
స్థానిక సందడి షురూ
న్యూస్‌రీల్
నిర్మల్
అ‘విశ్రాంత’ స్విమ్మర్లు!
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ చెరువులో అన్ని కాలాల్లో సమృద్ధిగా నీరు ఉంటుంది. 70 ఏళ్లకు చేరువగా ఉన్న వారు హుషారుగా ఇక్కడ ఈత కొడుతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
మామడ: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రా వు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ప్రత్యేక అధికారి పరమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. హైకోర్టు సైతం నోటిఫికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నేడు (అక్టోబర్ 9న) మొదటి విడత నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్‌లో 75 ఎంపీటీసీ స్థానాలకు, 9 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి విడత జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.
బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ..
మరోవైపు బీసీ కేటగిరీ రిజర్వేషన్లపై హైకోర్టులో వచ్చే తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. కోర్టు ఇప్పటికే నోటిఫికేషన్ నిలిపివేయకూడదని స్పష్టం చేసినందువల్ల ఇది ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపించదని భావిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్
విడతల వారీగా..
మొదటి విడత జరిగే ఎంపీటీసీ,
జెడ్పీటీసీల మండలాలు
మండలం ఎంపీటీసీలు ఓటర్లు
ఖానాపూర్ 8 23,658
పెంబి 5 10,886
కడెం 10 29,159
దస్తూరాబాద్ 5 12,894
మామడ 9 26,072
లక్ష్మణచాంద 9 24,577
నిర్మల్ 7 22,751
సోన్ 8 21,801
సారంగాపూర్ 14 39,516
తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముఖ్యమైన తేదీలు
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
అక్టోబర్ 9
చివరి తేదీ : అక్టోబర్ 11
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ
అక్టోబర్ 15
ఎన్నికల తేదీ : అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు : నవంబర్ 11

స్థానిక సందడి షురూ