పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

May 23 2025 5:35 AM | Updated on May 23 2025 5:35 AM

పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్ట ర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. క లెక్టరేట్‌ సమావేశ మందిరంలో పట్టణ పరిధిలో చే పట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్‌, రె వెన్యూ శాఖల అధికారులతో గురువారం సమీక్ష ని ర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. చెరువుల అభివృద్ధి, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల ని ఆదేశించారు. జూన్‌ 30లోపు గృహ, వాణిజ్య ప న్నుల వసూలు వంద శాతం వసూలు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యా ర్డుకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వార్డులో పారిశుద్ధ్య, డ్రై డే నిరంతరం కొనసాగించాలన్నారు. దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్‌ మిషన్లు సిద్ధంగా ఉంచాలని వీధి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌ ప్రాంతా ల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కూడళ్ల వద్ద డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అ హ్మద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement