
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
దస్తురాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకో వాలని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని మున్యాల జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణను గురువారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న డిజిటల్ కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్, ప్రధానోపాధ్యాయుడు వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలు
● డీఈవో పి.రామారావు
లక్ష్మణచాంద/ఖానాపూర్: ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని డీఈవో రామారావు అన్నారు. మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాలలో, ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను గురువారం పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలని సూచించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంఈవోలు ఆర్.అశోక్‌వర్మ, ప్రేమ్‌సాగర్, మండల రిసోర్స్ పర్సన్లు అర్చన, శివరాణి, మోహన్, చంద్రమోహన్, తేజ, సాయన్న, గంగాధర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మహేందర్, సుధాకర్, డీఆర్పీలు తిరుమలేశ్, సుజాత, సీఆర్‌పీలు కవిత, వనిత, పాల్గొన్నారు.