
మొక్కలు సిద్ధం చేయాలి
● బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వాణన్
నర్సాపూర్(జి): వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వాణన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని కేంద్రీయ హరిత నిధి వన నర్సరీ, ఈజీఎస్ నర్సరీలను గురువారం పరిశీలించారు. మొక్కలను బాధ్యతాయుతంగా సంరక్షించాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలో గతంలో నాటి ఏపుగా పెరిగిన వివిధ రకాల పండ్ల, ఇతర మొక్కలను పరిశీలించారు. అటవీ జంతువులకు, పక్షులకు ఆహారంగా అవి ఉపయోగపడతాయన్నారు. సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట డీఎఫ్‌వో నాగిని భాను, సారంగాపూర్ డీఆర్‌వో నజీర్ ఖాన్, ఎఫ్‌ఎస్‌వో అలేఖ్య, ఎఫ్‌బీవోలు సాయరెడ్డి, ఫాజిల్ హుస్సేన్ ఉన్నారు.