
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
భైంసాటౌన్: అర్జీదారులు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తేవాలని ఎస్పీ జీ జానకీషర్మిల పేర్కొన్నారు. బుధవారం పట్ట ణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్‌లో సూచించారు. భరోసా కేంద్రంలో షీ టీం సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భైంసాలో భరోసా కేంద్రం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపీనా థ్, నైలు, షీ టీమ్ ఇన్‌చార్జి పెర్సిస్, సిబ్బంది, క్యాంప్ ఇన్‌చార్జి రఘువీర్ పాల్గొన్నారు.