
ఆయిల్‌పామ్ గెలల కోత షురూ..
లోకేశ్వరం: మండలంలోని పంచగుడి గ్రామంలోని ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి ఆయిల్‌పామ్ తో టలో మొదటి గెలల కోతను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్‌పామ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇద్దరు రైతులకు కొనుగోలు కేంద్రం ఐడీ కార్డులు అందజేశారు. ఆయిల్‌పాం టన్ను ధర ప్రస్తుతం రూ.21 వేలు ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి రమణ, ప్రియూనిక్ ఇండియా కంపెనీ డీజీఎం మల్లేశ్వర్‌రావు, భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్‌రావు పటేల్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్‌రావు, బీజేపీ మండల కన్వీనర్ సాయన్న, ఆయిల్‌పామ్ ఏరియా మేనేజర్ శేఖర్ పాల్గొన్నారు.
కోత ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్