ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో నమ్మకం పెంచాలని వరంగ ల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా కాలానికి అనుగుణంగా బోధనా విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడికి శిక్షణ లక్ష్యాలు తెలిసి ఉండాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి నరసయ్య, జిల్లా ప్రణాళిక సమన్వయకర్తలు రాజేశ్వర్, లింబాద్రి, డీఆర్పీలు పాల్గొన్నారు.
ఆరోగ్య మెలకువలు నేర్పాలి..
వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతీరోజు విద్యార్థులకు ఆరోగ్య మెలకువలు నేర్పాలని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కత్తి కిరణ్ అన్నారు. విజయ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యా య శిక్షణ శిబిరంలో మాట్లాడారు. విద్యార్థులతో రోజూ ఆసనాలు వేయించాలన్నారు. సరైన క్రమంలో వ్యాయామం చేయకపోతే జరిగే అనర్థాలను వివరించారు. అధికారులు ప్రవీణ్ కుమార్, శ్రీని వాస్, భూమన్న, జమున, అన్నపూర్ణ పాల్గొన్నారు.


