
గ్రామ పాలనకు కొత్త ఊపిరి
● జీపీవోల నియామక ప్రక్రియ వేగవంతం.. ● ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి ● జిల్లా నుంచి 100 మంది విద్యార్హతల నివేదిక ● ఈనెల 25న రాత పరీక్షకు ఏర్పాట్లు ● త్వరల్లో విధుల్లోకి గ్రామ పాలన అధికారులు
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రా మ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారి (జీపీవో) నియామక ప్ర క్రియను వేగవంతం చేసింది. ఈ నెల 25న జీపీవోల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. గతంలో వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారి నుంచి జీపీవోలను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది.
పూర్వ వీఆర్‌వోలు,
వీఆర్‌ఏలకు ప్రాధాన్యం..
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జీపీవో పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో 151 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొన్నింటిని తిరస్కరించారు. గతంలో వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారు, ఇంటర్‌తోపాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి ఆమోదం లభించింది. జిల్లా నుంచి 63 మంది వీఆర్‌వోలు, 80 మంది వీఆర్‌ఏలు, 8 మంది ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు.
రెవెన్యూ గ్రామానికి
ఒక జీపీవో
జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 430 రెవె న్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రా మానికి ఒక జీపీవోను నియమించనున్నారు. గ్రామీణ భూసమస్యలపై అవగాహన ఉన్న పూ ర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏలను జీపీవోలుగా ఎంపిక చేస్తున్నారు. వీరు భూభారతి చట్టం అమలు బా ధ్యతలు నిర్వహించడంలో కీలకం కానున్నారు.
సర్వీసుపై అస్పష్టత..
2022లో వీఆర్‌వో వ్యవస్థను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి వరకు పనిచేస్తున్నవారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చాలా మంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిని స్వస్థల జిల్లాలకు తిరిగి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గత డిసెంబర్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించగా, గతనెల 26 వరకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష రాయాలని స్పష్టం చేశారు. అయితే, సర్వీసు విషయంలో స్పష్టత లేకపోవడంతో కేవలం 151 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లా వివరాలు
మొత్తం మండలాలు 18
గ్రామపంచాయతీలు 400
జీపీవోలుగా దరఖాస్తు
చేసుకున్నవారు 151
ఆమోదం పొందినవి 100
తిరస్కరించినవి 51
వీఆర్వోలు 63
ఆమోదించినవి 51
తిరస్కరించినవి 12
వీఆర్‌ఏ 80
ఆమోదించినవి 49
తిరస్కరించినవి 31
ఇతరులు 8
ఆమోదించినవి 0
తిరస్కరించినవి 8