
అహల్యబాయి హోల్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్
నిర్మల్‌చైన్‌గేట్: రాణి అహల్యబాయి హోల్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకను పట్టణంలోని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పార్టీ శాఖ ఆదేశాల మేరకు జిల్లా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ మొఘలుల కాలంలో ధ్వంసమైన హిందూ దేవాలయాలను పరిరక్షణకు రాణి అహల్యబాయి హోల్కర్ కృషి చేశారన్నారు. ఆమె హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి, హిందువులను సంఘటితం చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్‌నాథ్, కార్యక్రమ జిల్లా కన్వీనర్ అలివేలు మంగ, రాష్ట్ర నాయకురాలు ఆడె లలిత, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వైద్య రజిని, ముధోల్ కన్వీనర్ సీరం సుష్మారెడ్డి, ఖానాపూర్ కన్వీనర్ సత్యవతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి పాల్గొన్నారు.