
‘తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలపై కఠిన చర్యలు’
నిర్మల్‌చైన్‌గేట్: తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. పథకాల లబ్ధి కోసం కొందరు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు రెవెన్యూ, పోలీసు శాఖలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టి పత్రాలు జారీ చేసిన అధికారులు, వాటిని వినియోగించి లబ్ధి పొందినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బాక్సింగ్‌లో ప్రతిభ
నిర్మల్‌టౌన్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 12 బాలుర విభాగంలో ఆరవ్, నిహాల్, బాలి కల విభాగంలో సహస్ర గోల్డ్ మెడల్ సాధించారు. జ్యోత్స్న కాంస్య పతకం సాధించింది. అండర్–14 బాలుర విభాగంలో ధృవ బంగా రు, దినేష్ వెండి పతకాలు సాధించగా, అండర్–17 బాలికల విభాగంలో నిఖిత, శ్రావణి గోల్డ్, అక్షిత సిల్వ ర్, కీర్తన, అభినయ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరు ఈనెల 24 నుంచి 26 వరకు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి అభినందించారు.
పోడు సమస్య పరిష్కరించండి
కడెం: పట్టాలు లేని పోడు భూముల సమస్య పరిష్కరించాలని మండలంలోని పాండ్వపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కోరారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌కు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు సోమవారం వినతిపత్రాలు అందించారు. పోడు రైతులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ కలెక్టరేట్‌లో మాట్లాడారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రకటించడం సరికాదన్నారు. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దావనపల్లి శేఖర్, తుమ్మల ప్రతాప్, బండి లచ్చన్న, కోండ్ర ఆనంద్, పిన్నం గోపి, కానుగంటి మల్లేశ్, మహేశ్, సురేశ్, లచ్చన్న పాల్గొన్నారు.