
రైతు సంక్షేమానికి ఆత్మ కమిటీలు
నిర్మల్‌చైన్‌గేట్: రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్‌గా రామ్‌రెడ్డి, 27 మంది డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా శ్రీహరిరావు హాజరై మాట్లాడారు. రైతులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆత్మ కమిటీపై ఉందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మద్దతు ధరపై రూ.500 బోనస్ వంటి పథకాలు రైతుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.