నిర్మల్‌చైన్‌గేట్: ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే వారితో కలిసి భోజనం చేస్తానని కలెక్టర్ గతంలోనే ప్రకటించారు. ఈమేరకు తన క్యాంపు కార్యాలయంలో 13 మందికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలు, లక్ష్యాలు తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా జడ్జి శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జీవితానుభవం ఎక్కువ ఉంటుందన్నారు. సమస్యల పరిష్కార నైపుణ్యం ఉంటుందని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మీరు సాధించిన విజ యం జిల్లాకు గర్వకారణమన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా జడ్జి, ఎస్పీ, ఇతర అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. తర్వాత చిరు కానుకలు అందించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీఈవో పి.రామారావు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
టెన్త్ టాపర్లకు కలెక్టర్ డిన్నర్


