
మిల్లును తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్
భైంసాటౌన్/నర్సాపూర్ (జి)/కుంటాల: రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సూచించారు. భైంసాలోని కల్లూరులోని ఆంజనేయ రైస్‌మిల్, లోకేశ్వరంలోని ద్వారక, నర్సాపూర్(జి) మండలం చాక్‌పెల్లిలోని లక్ష్మిప్రభు రైస్‌మిల్లులను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా మిల్లుల్లో ధాన్యం నిల్వలు, అప్పగించిన బియ్యం, తది తర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2023 –24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గడువులోగా మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించిన ట్లు తెలిపారు. జాప్యం చేసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాతకుంటాల మడలం అర్లి(కె)గోదాంను పరిశీ లించారు. ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యాన్ని నిల్వలు ఉంచకుండా చూసుకోవాలని సూచించారు.