బదిలీలకు 1,920 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బదిలీలకు 1,920 దరఖాస్తులు

Sep 8 2023 12:54 AM | Updated on Sep 8 2023 10:03 AM

- - Sakshi

బదిలీల ప్రక్రియను పరిశీలిస్తున్న డీఈవో రవీందర్‌రెడ్డి

నిర్మల్‌: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. బదిలీ కోసం 1,920 మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 1,780 మంది దరఖాస్తు చేసుకోగా తాజాగా 140 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరంతా ఎంఈవోల ద్వారా తమ హార్డు కాపీలను డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సీనియర్‌ పీజీ ప్రధానోపాధ్యాయులతోపా టు, ఉపాధ్యాయులను కమిటీగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement