తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే.. | Sakshi
Sakshi News home page

Vedic Clock: తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..

Published Mon, Feb 26 2024 1:34 PM

World First Vedic Clock Ready - Sakshi

ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి  ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. 

వేద గడియారానికి సంబంధించిన ఇన్‌స్టలేషన్,  టెస్టింగ్ వర్క్  పూర్తయింది.  భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. 

ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి  ఒకటిన  ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ), గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. 

సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్‌ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు.

Advertisement
 
Advertisement