
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్‌లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి.
ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు.
దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్‌ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది.
కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్‌లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది.
నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్‌కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s
— Tushar Rai (@tusharcrai) September 15, 2025