Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువకుడు.. యువతి మెడపట్టుకొని లాక్కెళ్లి కారులోకి ఎక్కించి..

Video: Delhi Man Assaults Woman Pushes Into Cab On Busy Road - Sakshi

రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ యువకుడు యువతితో రెచ్చిపోయి ప్రవర్తించాడు. అందరిముందే యువతిపై చేయిచేసుకోవడమే కాకుండా ఆమెను బలవంతంగా మెడ పట్టుకొని కారులోకి ఎక్కించాడు. ఈ అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీంటిని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో ప్రకారం.. ఢిల్లీలోని మంగోల్‌పురి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో వాహనం ఆగింది. ఇంతలో కారులో నుంచి దిగి యువతి బయటకు వెళ్లింది. వెంటనే కారులో నుంచి యువకుడు దిగి యువతి వెనకాలే వెళ్లాడు. రోడ్డు మీద వెళ్తున్న  ఆమెపై చేయిచేసుకున్నాడు. షర్ట్‌ పట్టుక్కొన్ని లాక్కొచ్చాడు. బలవంతంగా కారులోకి నూకేశాడు. కారులో సైతం యువతిపై పిడిగుద్దులు గుద్దాడు.

వీరిద్దరితోపాటు కారు వద్ద మరో యువకుడు కూడా ఉన్నాడు. అక్కడ జరిగే తతంగాన్నంతా చూస్తూ ఉన్నాడే తప్ప అతన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. అనంతరం ముగ్గురు క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే  క్యాబ్ డ్రైవర్‌తో సహా రోడ్డు మీద ఉన్న ఎవరూ బాధితురాలికి సహాయం చేయడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో వీడియో ఆధారంగా విచారణ చేపట్టారు.

క్యాబ్‌ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్యాబ్‌ను చివరిసారి గురుగ్రామ్‌లోని ఐఎస్‌ఎఫ్‌సీఓ చౌక్‌ వద్ద గుర్తించగా.. పోలీసులు అక్కడికి వెళ్లి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు(యువతి, ఇద్దరు యువకుడు) రోహిణి నుంచి వికాస్‌పురి వరకు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకొని వెళ్లిన్నట్లు తెలిసింది. దారిలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సదరు యువకుడు ఆమెను క్యాబ్‌లోని నెట్టిన్నట్లు డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడు. ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top