కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు | Union Cabinet key decisions on April 8 check details | Sakshi
Sakshi News home page

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

Apr 18 2026 4:36 PM | Updated on Apr 18 2026 4:41 PM

 Union Cabinet key decisions on April 8 check details

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

నిరంతర సముద్రయాన బీమా కవరేజీ  కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.

రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్  ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

మరిన్ని కీలక నిర్ణయాలు

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం 

  • ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా పెరిగిన రెండు శాతం డీఏ

  • డీఏ పెంపుతో ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం 

  • 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,68.27 శాతం పెన్షన్ దారులకు  ప్రయోజనం

  • ఘజియాబాద్, సీతాపూర్ థర్డ్ , ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు 14,926 కోట్ల రూపాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement