గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం | Two Girls From Jalandhar Got Married in Gurudwara, Seeking Protection From Family Members - Sakshi
Sakshi News home page

గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం

Published Thu, Oct 26 2023 1:05 PM

Two Girls Got Married in Gurudwara - Sakshi

చండీఘడ్‌లోని జలంధర్‌కు చెందిన ఇద్దరు యువతులు ఖరార్ (మొహాలీ)లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. 

వీరి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఇద్దరికీ జీవిత భద్రత, స్వేచ్ఛను అందంచాలని జలంధర్ ఎస్‌ఎస్‌పీని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన ఆ ఇద్దరు యువతులు తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, అక్టోబరు 18న ఖరార్‌లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. 

అయితే ఈ వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులు సంతోషంగా లేరని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వారు కోర్టుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ముందు ఆ యువతులు జలంధర్ ఎస్‌ఎస్‌పీకి  లేఖ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని జలంధర్ ఎస్‌ఎస్‌పీని హైకోర్టు ఆదేశించింది. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరింది.
ఇది కూడా చదవండి: ‘రెడ్‌ లైట్‌ ఆన్‌- వెహికిల్‌ ఆఫ్‌’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?

Advertisement
 
Advertisement