విజయ్‌ విజన్‌ ఉన్నోడు..వారికి పీడకలే! | TVK chief net worth Vijay a visionary like Warren Buffett netizens jokes | Sakshi
Sakshi News home page

విజయ్‌ విజన్‌ ఉన్నోడు..వారికి పీడకలే!

May 6 2026 5:15 PM | Updated on May 6 2026 6:06 PM

TVK chief net worth Vijay a visionary like Warren Buffett netizens jokes

వారెన్‌ బఫెట్‌లా

టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌ విజన్‌ ఉన్నవాడు, వారెన్‌ బఫెట్‌లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

27 పేజీల అఫిడవిట్‌లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో   ఒక సేవింగ్‌బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను  ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో ఎస్‌ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్‌ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.

ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి?

ఇదీ చదవండి: సింగిల్‌ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్‌ టాపిక్‌గా విజయ్‌ ఆస్తి
 

నెటిజన్ల కామెంట్స్‌

  • "మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు  పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు.

  • "వంద కోట్ల రూపాయలను ఎఫ్‌డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్‌యూ స్టాక్స్‌లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.  వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.

  • ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని  వ్యాఖ్యానించారు.  (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్‌ వ్యాఖ్యలు)

  • ముఖ్యంగా "టాప్‌ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్‌లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్‌. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక  ఎక్స్‌ యూజర్  వివరించారు.

  •  "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement