మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం

Published Sun, Dec 17 2023 1:09 PM

Tension In Bihar Village After Priest Shot Dead - Sakshi

పాట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. 

మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్‌కి పూజ కోసం వెళ్లిన మనోజ్‌ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్‌ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు.

ఈ వార్త తెలవడంతో  స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. 

అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్‌ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు.    

ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

Advertisement
 
Advertisement