Karnataka: పోకిరీ హెడ్‌మాస్టర్‌కు దేహశుద్ధి.. విద్యార్థిని పదేపదే గదికి పిలిపించి...

Teacher Molestation Assaulted Student At Hasan District - Sakshi

యశవంతపుర: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకాలో జరిగింది. సంకేనహళ్లి సమీపంలోని తరళబాళు విద్యాసంస్థకు చెందిన శివనంజుండేశ్వర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేంద్ర పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని పదేపదే తన గదిలోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు.

ఈ నెల 7న అర్ధ పరీక్షలు ముగియగానే తన గదికి పిలిపించి వేధించాడు. దీంతో విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా ఈనెల 10న పోలీస్‌ స్టేషన్‌కు పిలిచారు. నరేంద్ర వెళ్లలేదు. శనివారం నేరుగా స్కూల్‌కు రావటంతో గ్రామస్థులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.   

కీచక వ్యాయామ ఉపాధ్యాయుడు  
బనశంకరి: బెంగళూరులో 13 ఏళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు అయిన అంజినప్ప విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాఠశాల హెచ్‌ఎం హెబ్బాళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కీచకునిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

(చదవండి: పెళ్లి వేడుక.. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి ట్విస్ట్‌..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top