తిరువొత్తియూరు: తమిళనాడు ప్రభుత్వం 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై కలె క్టర్‌తో సహా మరికొంతమంది ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు.. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కిర్లోష్ కుమార్, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
సామాజిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శరణ్య అరి, పెరంబలూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. పెరంబలూరు జిల్లా కలెక్టర్ మృణాళిని, అరియలూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. చెంగల్పట్టు జిల్లా మాజీ కలెక్టర్ మాలతి హెలెన్, చెన్నై జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. కో యంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివగురు ప్రభాకరన్, రామనాథపురం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కవిత, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్)గా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ వీరప్రతాప్ సింగ్, తిరుచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవరాజ్ కుమార్, మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్) కట్టా రవి తేజ, కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు.


