సంక్రాంతి కానుకలో మృతిచెందిన బల్లి.. ఫిర్యాదుదారుడిపైనే కేసు, మనస్తాపంతో

Tamil Nadu: Dead Lizard Found Inside Sankranthi Kanuka - Sakshi

మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య

అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన 

సాకక్షి, చెన్నై: సంక్రాంతి కానుకలో బల్లి మృతిచెందిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి తిరుత్తణిలో చోటు చేసుకుంది. శరవణ పుష్కరిణి సమీపంలోని చౌక దుకాణంలో అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త నాథన్‌ (65) నాలుగు రోజుల కిందట సంక్రాంతి కానుకలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా చింతపండులో మృతి చెందిన బల్లి ఉన్నట్లు గుర్తించి చౌక దుకాణం సేల్స్‌ మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు.
చదవండి: యువతులను వంచించి వికృతానందం

సేల్స్‌మ్యాన్‌ శరవణన్‌ పట్టించుకోకపోవడంతో మీడియాకు తెలిపాడు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. మనస్తాపం చెందిన అతని కుమారుడు కుప్పుస్వామి (35) మంగళవారం సాయంత్రం కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనికి నిరసనగా అన్నాడీఎంకే నేతలు రాస్తారోకో చేపట్టారు. 
చదవండి: Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్‌ వేసుండకపోతే పరిస్థితి....

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top