లేడీస్‌ టైలర్‌కు వీధిలో దేహశుద్ధి | Woman Beaten in Public for Cheating ₹3 Crore from Locals | Sakshi
Sakshi News home page

లేడీస్‌ టైలర్‌కు వీధిలో దేహశుద్ధి

Oct 28 2025 11:49 AM | Updated on Oct 28 2025 12:03 PM

Tailor lady Fraud case

మహిళలకు రూ.3 కోట్లు టోపీ

హాసన్‌ (దొడ్డబళ్లాపురం): చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న స్త్రీపై ఇద్దరు మహిళలు దాడి చేస్తుండడం చూశారా..! మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి రూ.3 కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన మహిళను నడిరోడ్డులో చితకకొట్టిన సంఘటన హాసన్‌ పట్టణంలోని అరళేపేటెలో జరిగింది. స్థానికంగా లేడీస్‌ టైలర్‌ షాప్‌ నిర్వహించే హేమావతికి ఇలా దేహశుద్ధి గావించారు.  

అప్పులు తీసుకుని ఆస్తులు..  
ఆమె టైలర్‌గా అందరితో పరిచయాలు పెంచుకుంది. ఒకరికి తెలియకుండా మరొక మహిళకు మాయమాటలు చెప్పి రూ. లక్షలాదిగా అప్పులు తీసుకుంది. ఆ డబ్బుతో దండిగా బంగారు నగలు, కారు, స్థలాలు వంటివి కొనుక్కుంది. విలాస జీవనం జీవిస్తోంది. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో అడిగి అడిగి విసిగిపోయిన మహిళలు రౌద్రరూపం దాల్చారు. హేమావతిని రోడ్డు మీద జుట్టుపట్టుకుని కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. హాసన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement