breaking news
rs.3 crores
-
టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్మెంట్ చేసిన చింటూ
చిత్తూరు : చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ పలువురు టీడీపీ నేతలకు సాయపడినట్లు పోలీసులు విచారణలో వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తుండగా పలు విషయాలు వెల్లడి అయినట్లు సమాచారం. చిత్తూరులో అధికార పార్టీలో ఉంటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ నేత ఇటీవల చింటూ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబాయిలో తనకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి మాఫియా ద్వారా చింటూ సెటిల్ చేసినట్లు, చింటూ అనుచరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనికి ప్రతిఫలంగా చింటూకు ఆ నేత విదేశీ తుపాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న చింటూ భారత్‌కు సమీప దేశాల్లోని ద్వీపాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మేళ్లచెర్వు(నల్లగొండ): నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ కర్మాగారానికి చెందిన 60 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టర్బయిన్ పేలిపోవడంతో మంటలు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఫ్యాక్టరీకి చెందిన అగ్నిమాపక నియంత్రణ విభాగం సిబ్బంది సత్వరమే స్పందించి అరగంటలో మంటలను ఆర్పివేశారు. మధ్యాహ్నం భోజనం కోసం కార్మికులు బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగినట్టు ప్లాంట్ అధికారులు తెలిపారు. -
డైరెక్టర్‌కి క్లాస్ పీకిన మహేశ్