తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court Of India Notices To Telugu Desam Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాల తర్వాత చేపట్టనుంది. అయితే గతంలో ఆర్కే పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేయగా.. హైకోర్టు ఉ‍త్తర్వులను సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top