
పొరుగున నేపాల్‌లో ఏం జరుగుతుందో చూడండి
కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య
మనది బలీయమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ కితాబు
న్యూఢిల్లీ: బలహీన ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమైన రాజ్యాలు కుప్పకూలుతున్నాయని, బలీయమైన మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనసభల ఆమోదం పొంది తమ వద్దకు వచి్చన బిల్లులను నిరీ్ణత కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంలో వాదోపవాదనలు జరుగుతున్న కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది.
‘‘పౌరులు ప్రభావితమయ్యే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహాలు కోరవచ్చు అని మన భారత రాజ్యాంగం ఉద్భోదిస్తోంది. ఇలాంటి సమగ్రతను సంతరించుకున్న మన రాజ్యాంగాన్ని చూసి గరి్వస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌లో ఇప్పుడు ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం’’అని సీజేఐ గవాయ్ అన్నారు. బంగ్లాదేశ్‌లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ గుర్తుచేశారు. ధర్మాసనంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సైతం సభ్యులుగా ఉన్నారు.
నేపాల్‌లో..
తమ వద్ద గడువులోపు సమగ్రస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్న సాకుతో సోషల్ మీడియా యాప్‌లపై పూర్తిస్థాయి నిషేధం విధించి నేపాల్ ప్రభుత్వం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంది. చివరకు ప్రధాని ఓలీ తన పాలనావైఫల్యాన్ని అంగీకరిస్తూ గద్దె దిగారు. అయినాసరే జెన్ జెడ్, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన ఆగకపోగా మరింత హింసాత్మకంగా మారి చివరకు 30 మంది ప్రాణాలను బలిగొంది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పారీ్టల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల తగలబెట్టారు. కొన్నింటిని ధ్వంసంచేశారు. మాజీ ప్రధాని షేర్‌బహదూర్ దేవ్‌బా ఇంటిని చుట్టుముట్టి దేవ్‌బా, భార్య అర్జు రాణాలపై దాడిచేశారు. ప్రజల ఆస్తుల విధ్వంసం యథేచ్చగా సాగింది.
బంగ్లాదేశ్‌లో..
భారత్‌కు తూర్పు వైపున్న మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ సైతం ఉద్యమ సెగకు బలైంది. 1971 విమోచన ఉద్యమకారుల వారసులకు సివిల్‌సరీ్వసెస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలి్పంచడంతో అక్కడి నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అది హఠాత్తుగా గత ఏడాది జులైలో మహోగ్రరూపం దాల్చి దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు దేశ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రాణభయంతో రాజధాని ఢాకాను వీడి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా అది సుస్థిర పాలనను అందివ్వలేక ఆపసోపాలు పడుతోంది.