జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్‌

Several Animals Drink From Water Hole To Quench Thirst Video Viral - Sakshi

మనిషి అంటేనే స్వార్థానికి పర్యాయపదంగా మారిన రోజులు ఇవి. ఏదైనా నాది, మాది అకుంటాడే తప్ప మనది అనే మాట రానేరాదు. అత్యాశతో కావాల్సిన దానికంటే ఎక్కువగా కూడబెట్టుకుంటాడు. అవరానికి మించిన వనరులను సమకూర్చుకుంటాడు. ఆపద వస్తే ఆదుకునేందుకు కూడా ముందుకు రాడు. ఎదుటి వారికి సాయం చేసే గుణం ఎప్పుడో పోయింది. కోటికి ఒక్కరో ఇద్దరో నిస్వార్థంగా పొరుగువారికి సాయం చేస్తున్నారు తప్ప దాదాపు అంతా స్వార్థపరులే. కానీ జంతువులు అలా కాదు. అవి తమకు కావాల్సినదాన్నే తీసుకుంటాయి తప్ప.. అత్యాశతో ఎక్కువగా తీసుకుపోదు. తనకు హాని లేనంత వరకు ఇతర జంతువుల జోలికి పోదు. పగ, ప్రతీకారాలు ఉండవు. అత్యాశా అసలే ఉండదు. కులం, మతం అనే భేదాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు జంతువులు మనకు గుణపాఠాన్ని నేర్పుతాయి. అవి యాధృచ్చికంగా చేసిన పనులే మనకు ఓ మంచి మర్గాన్ని చూచిస్తాయి. దానికి నిదర్శనం తాజా వీడియోనే.
(చదవండి : వార్ని.. కోపంతో కోట్ల విలువైన కారునే కాల్చేశాడుగా..)

ఓ చిన్న వాటర్‌ హోల్‌ వద్ద ఉన్న నీటిని వివిధ రకాల జంతువులు, పక్షులు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒక్కటి వచ్చి దాహాన్ని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఇతర జంతువులను అడ్డుకోవడం కానీ, లేదంటే అక్కడి ప్రదేశాన్ని నాశనం చేయడం కానీ చేయలేదు. ఆ చిన్నవాటర్ హోల్‌ దగ్గరికి కొన్ని గంటల వ్యవధిల్లోనే తోడేళ్లు, పాములు, కుందేళ్లు, కోడిపిల్లలు, ఎలుగు బంటులు వచ్చి దాహం తీర్చుకొని వెళ్లాయి. 57 సెంకడ్ల నిడివి గల ఈ వీడియోని ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్ నందా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..‘తక్కువ వినియోగించి ఎక్కువ షేర్ చేయండి. అడవి జంతువు దీంట్లో ముందుంటాయి. ఒక సింగిల్‌ వాటర్‌ హోల్‌ని గంటల వ్యవధిల్లోనే ఎన్ని జంతువులు వినియోగించుకున్నాయో చూడండి. ఒక్క సోర్స్‌ని ఎన్ని రకాల జంతువులు వినియోగించుకున్నాయో లెక్కించండి. వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రంశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘జంతువులను చూసి మనం చాలా నేర్చుకోవాలి’. ‘దురదృష్టవశాత్తు మనిషి ఇతరుకు పంచడం(షేరింగ్‌), జాగ్రత్తగా చూసుకోవడం (కేరింగ్‌) లాంటి వాటిని ఎప్పుడో మర్చిపోయాడు’, *నీటి ప్రాధాన్యత తెలియజేసే వీడియో ఇది’,‘అవి కులం, మతం అనే వాటికి దూరంగా ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top