కోవిషీల్డ్‌ బూస్టర్‌ కోసం సీరమ్‌ దరఖాస్తు | Serum Institute seeks DCGI approval for Covishield as booster dose | Sakshi
Sakshi News home page

article header script

కోవిషీల్డ్‌ బూస్టర్‌ కోసం సీరమ్‌ దరఖాస్తు

Published Thu, Dec 2 2021 6:06 AM | Last Updated on Thu, Dec 2 2021 6:06 AM

Serum Institute seeks DCGI approval for Covishield as booster dose - Sakshi

న్యూఢిల్లీ: కోవిషీల్డ్‌ కరోనా టీకాను బూస్టర్‌ డోసుగానూ అనుమతించాలని కోరుతూ  డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్‌) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్‌ తయారీసంస్థ సీరమ్‌ ఆ దరఖాస్తులో పేర్కొంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్‌ డోస్‌కు దేశంలో డిమాండ్‌ పెరిగిందని సీరమ్‌ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్‌ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్‌ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement