రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : ముగ్గురి దుర్మరణం.. | Rajasthan: 3 Killed In Bikaner As Under Construction Building Collapses | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : ముగ్గురి దుర్మరణం..

Jun 21 2021 7:30 AM | Updated on Jun 21 2021 9:39 AM

Rajasthan: 3 Killed In Bikaner As Under Construction Building Collapses - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. బికనీర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భవంతి, నిన్న రాత్రి(ఆదివారం) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు భవనంలో 8 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక పీబీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ క్రమంలో​ ముగ్గురు కూలీలు అప్పటికే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భవంతి కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, ట్రాఫిక్‌ నియంత్రించడం వంటి సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

చదవండి: నాలుగు రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే..

Advertisement
 
Advertisement
Advertisement