మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

President Murmu, PM Modi pay tribute to Mahatma Gandhi on his death anniversary at Rajghat - Sakshi

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. గన్‌ సెల్యూట్‌ , సర్వమత ప్రార్థనలు, గాంధీకి ఇష్టమైన గేయాలాపన జరిగాయి. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు నివాళులర్పించారు. ‘బాపుకు నా నివాళులు. దేశ సేవలో ప్రాణాలర్పించిన ఎందరో అమరుల త్యాగాలు దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని మరింత పెంచుతాయి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.  

ప్రధాని మోదీతో కొరోసీ భేటీ
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు సాబా కొరోసీ మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపారు. జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం ఆవశ్యకత కూడా ప్రస్తావనకు వచ్చినట్లు అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, జీ20 ఎజెండాతోపాటు ఐరాస సంస్కరణలపై చర్చించినట్లు జై శంకర్‌ పేర్కొన్నారు. పలు అంశాలపై వారి అవగాహన, స్పందన అద్భుతమని కొరోసీ కొనియాడారు. భారత్‌తోపాటు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top