హ్యాపీ బర్త్‌డే మోదీజీ | PM Narendra Modi was blown away by the birthday wishes | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే మోదీజీ

Sep 18 2022 6:01 AM | Updated on Sep 18 2022 6:01 AM

PM Narendra Modi was blown away by the birthday wishes - Sakshi

మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో తయారు చేసిన ప్రత్యేక థాలీ

న్యూఢిల్లీ/షోపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్ని వర్గాల నుంచీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ నిర్మాణం కోసం మోదీ అవిశ్రాంతంగా పని చేస్తున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అభినందించారు. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బిహార్‌ సీఎం నితీశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి పుట్టిన రోజులాగే శనివారం కూడా ప్రధాని పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. మధ్యప్రదేశ్‌లోని షోపూర్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. ‘‘లక్షలాది మంది మాతృమూర్తుల ఆశీర్వాదం నాకు కొండతం స్ఫూర్తి. సాధారణంగా పుట్టినరోజున అమ్మను కలిసి దీవెనలు తీసుకుంటా. కానీ ఈసారి ఇంతమంది తల్లులు నన్ను దీవించడం చూసి నా తల్లి పరవశించి ఉంటారు’’ అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజుల రక్తదాన్‌ అమృత్‌ మహోత్సవ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రారంభించారు. ‘‘ఇప్పటికే 1,00,506 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement