breaking news
mega blood donation
-
టీఎస్ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరాలకు అన్యూహ స్పందన
సాక్షి, హైదరాబాద్: 'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) రాష్టవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3315 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేశారు. రాష్ట్రంలోని 11 రీజియన్లలోని అన్ని డిపోలు, యూనిట్లలోని సిబ్బంది, ఔట్సోర్సింగ్ వారితో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన యువత, మహిళల నుంచి ఒక్కో యూనిట్ 350 ఎంఎల్ చొప్పున మొత్తం 3315 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, సురక్షిత సేవలను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలల్లోనూ సంస్థ భాగం కావడం తమకెంతో సంతోషంగా ఉందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను సంస్థ నిర్వహించిందని గుర్తు చేశారు. టీఎస్ఆర్టీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసిన వారి సేవను వెలకట్టలేమని కొనియాడారు. సామాజిక బాధ్యతగా సంస్థ సిబ్బంది, యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం మంచి పరిణామమని, టీఎస్ఆర్టీసీపై ప్రజల విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. “ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం అత్యవసరం. రక్తం అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. 3315 మంది అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది. రక్తదానం సేవ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి” అని బాజిరెడ్డి గోవర్దన్, వీసీ సజ్జనర్ సూచించారు. -
హ్యాపీ బర్త్‌డే మోదీజీ
న్యూఢిల్లీ/షోపూర్: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్ని వర్గాల నుంచీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ నిర్మాణం కోసం మోదీ అవిశ్రాంతంగా పని చేస్తున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభినందించారు. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పుట్టిన రోజులాగే శనివారం కూడా ప్రధాని పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. మధ్యప్రదేశ్‌లోని షోపూర్లో మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. ‘‘లక్షలాది మంది మాతృమూర్తుల ఆశీర్వాదం నాకు కొండతం స్ఫూర్తి. సాధారణంగా పుట్టినరోజున అమ్మను కలిసి దీవెనలు తీసుకుంటా. కానీ ఈసారి ఇంతమంది తల్లులు నన్ను దీవించడం చూసి నా తల్లి పరవశించి ఉంటారు’’ అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజుల రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ‘‘ఇప్పటికే 1,00,506 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’’ అన్నారు. -
జననేత జన్మదినం.. పులకించిన ‘అనంత’ జనం
జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం 1,015 మంది రక్తదానం... భాగస్వాములైన అన్ని నియోజకవర్గాల ప్రజలు రక్తదానం చేసిన డీసీసీబీ అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు భారీ కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ అనంత, ఎమ్మెల్యే విశ్వ, గురునాథ్‌రెడ్డి హిందూపురంలో నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు, విద్యార్థులకు దుస్తుల పంపిణీ పలు నియోజకవర్గాల్లో అన్నదానాలు.. రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్డు పంపిణీ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పండుగలా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్డు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. ఇందులో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు భాగస్వాములయ్యారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం తదితరులు కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిద్ధార్థ ఫంక్షన్ హాలులో యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి చేరుకున్నారు. సభలో ప్రసంగించారు. తర్వాత భారీ కేక్‌ను కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, డీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసుతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అయ్యప్ప మాలధారులు, మహిళలు కూడా రక్తదానం చేయడం విశేషం. సాయంత్రం వరకూ కొనసాగిన ఈ శిబిరంలో 1,015 మంది రక్తదానం చేశారు. రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్బ్యాంకుతో పాటు రెడ్‌క్రాస్, ఆర్డీటీకి అప్పగించారు. మధ్యాహ్నం అక్కడే అన్నదానం చేశారు. తర్వాత నేతలంతా కొవ్వూరునగర్కు వెళ్లి కార్పొరేటర్ సుశీలమ్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చేపల హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మంగళవారికాలనీ కమ్యూనిటీ హాలులోనూ కేక్ కట్ చేశారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. శాంతినగర్ నుంచి వినాయకసర్కిల్ వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. తర్వాత అన్నదానం నిర్వహించారు. హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో భారీ కేక్‌కట్ చేసి.. సర్వమత ప్రార్థనలు చేశారు. విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. గుంతకల్లులో సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆపై ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. గుత్తి ఆర్ఎస్లోని అనాథ ఆశ్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ దుప్పట్లు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. తాడిపత్రిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సాయిసింధు అనాథ శరణాలయం, శ్రీకృష్ణా వృద్ధాశ్రమంలో భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఆవుల తిప్పాయపల్లిలో రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి వృద్ధులు, అనాథలకు అన్నదానం చేశారు. కళ్యాణదుర్గం ఆస్పత్రిలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. మార్కెట్యార్డుమాజీ చైర్మన్ రఘునాథరెడ్ఢి ఆధ్వర్యంలో మానిరేవులో కేక్‌కట్ చేశారు. వందమంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. మడకశిర నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పార్టీనేతలు కేక్‌కట్ చేశారు. ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో ఎంపీపీ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి.. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కేక్‌కట్ చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారిపల్లి వద్దనున్న వృద్ధాశ్రమంలో పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఉరవకొండలో రాష్ట్రకార్యదర్శి అశోక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ ఆధ్వర్యంలో వృద్ధా«శ్రమంలో అన్నదానం చేశారు. ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మండల కన్వీనర్లు కేక్‌కట్ చేశారు. కనగానపల్లి అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి తలుపుల మండలం వేపమానిపేట దళితవాడలో కేక్‌కట్ చేసి.. మిఠాయిలు పంచారు. కదిరి పట్టణంలోని ఇక్బాల్ సర్కిల్లో మాజీమంత్రి మహ్మద్‌షాకీర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, పార్టీ నేత బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. పెనుకొండలో పార్టీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ధర్మవరంలో జిల్లా కార్యదర్శి మేడాపురం వెంకటేశ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సీజీసీ సభ్యుడు గిర్రాజ్నగేశ్ ఆధ్వర్యంలో గొట్లూరు అనాథాశ్రమంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. బత్తలపల్లిలో ఎంపీపీ కోటి సూర్యప్రకాశ్‌బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.