వీడియో: ఎన్నికల ర్యాలీలో చిన్నారులతో ప్రధాని మోదీ ముచ్చట్లు

PM Narendra Modi Interacts With Children In Karnataka - Sakshi

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని కలబురిగిలో మెగారోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోకు ముందకు ప్రధాని మోదీ తన కోసం ఉత్సాహంగా వేచి ఉన్న పిల్లలను చూసి వారి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ చిన్నారులంతా చదవుకుంటున్నారో లేదో అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా మోదీ.. మీరంతా పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. అందులో ఓ చిన్నారి డాక్టర్‌, మరొకరు పోలీస్‌ అని చెబుతుండటంతో..మోదీ ప్రధాని కావాలనుకోవడం లేదా అని అడిగారు. అందుకు ఓ చిన్నారి వెంటనే తాను కూడా మోదీలానే అవ్వాలనుకుంటున్నట్లు బదులిచ్చాడు. మోదీ రోడ్డు షో సందర్భంగా ప్రధాని అశ్విక దళం వెళ్లే రహదారికి ఇరువైపుల ప్రజలు క్యూలో నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మోదీ కూడా చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం పలికారు.

ఇదిలా ఉండగా, కర్ణాటలక ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ గెలుపు లక్ష్యంగా ప్రచార ర్యాలీలు, రోడు షోలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మోదీ కర్ణాటకలో భారీగా రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా భారీగా ప్రచారాలు చేస్తున్నారు.

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అదీగాక కర్ణాటక ఎన్నికలను కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా చూస్తోంది బీజేపీ. అందుకే ఇతర రాష్ట్రల కంటే కర్ణాటకపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇక్కడే రెండోసారి అధికారాన్ని చేజిక్కించకోవాని చూస్తోంది బీజేపీ. పైగా పూర్తి మెజారిటీతో అధికారంలో రాగాలని ధీమా వ్యక్తం చేస్తోంది కూడా. కాగా, మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.  

(చదవండి: సీఎం బొమ్మైకు పరీక్ష..వరుణలో సిద్దుకు తేలికేనా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top