Bengaluru Metro Station Inaugurated By PM Modi, Flooded After Rain - Sakshi
Sakshi News home page

మెట్రోస్టేషన్‌ను ప్రారంభించిన మోదీ.. నాలుగు రోజుల్లోనే వరదలమయం!

Apr 6 2023 11:27 AM | Updated on Apr 6 2023 11:56 AM

PM Narendra Modi Inaugaurated Bengaluru Metro Station, Flooded After Rain - Sakshi

బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ప్రారంభించిన మెట్రో స్టేషన్‌ను వరదలు ముంచెత్తాయి. కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ప్రాజెక్ట్‌ పనులు ఎలా పూర్తి చేశారంటూ మెట్రో ప్రయాణికులు ప్రభుత్వ తీరుపై మండిపతున్నారు. బెంగళూరులో రెండో దశలో భాగంగా వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు పూర్తైన కొత్త మెట్రో లైన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. 13.71 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించారు.

బెంగళూరులో కురిసిన వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది. ప్లాట్‌ఫాం, టికెట్‌ కౌంటర్ దగ్గర భారీగా వర్షం నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్న వర్షానికే ఆ మెట్రో స్టేషన్‌లో వర్షం నీరు నిలిచిపోతే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఇంకేంత దారుణంగా ఉంటుందని అని ప్రశ్నించారు. 

మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో బెంగళూరులో విమాన సర్వీసులు, ట్రాఫిక్‌ స్తంభించిపోయాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగర శివార్లలో భారీ నీటి ఎద్దడి కారణంగా 14 విమానాలు దారి మళ్లించడంతో పాటు అనేక ఇతర విమానాలు ఆలస్యమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement